హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోతులతో ప్రమాదకరంగా వంతెన

ELR: గణపవరం వెళ్లే ప్రధాన రహదారి ఉంగుటూరు మండలం రావులపర్రు మురుగుకోడు వద్ద ఆర్ అండ్ బి వంతెన గోతులమయంగా మారింది. ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెన వద్ద ఏర్పడిన గోతుల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.