హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైపాస్‌ రోడ్డుకు సీఎం సానుకూల స్పందన

TPT: దాసుకుప్పం బైపాస్‌ రోడ్డు మంజూరు చేయాలని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి, తిరుపతి జిల్లా కలెక్టర్‌కు తెలియజేసి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరే దిశగా ముందడుగు పడిందని హర్షం వ్యక్తమవుతోంది.