హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మన జిల్లా ప్రత్యేక వంటకం రాగిసంగటి

ATP: రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకత తీసుకువచ్చే ఆహార పదార్థం రాగి సంగటి. పోషక విలువలతో కూడిన ఈ వంటకం ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రసిద్ధి పొందింది. రాగి సంగటిని సాధారణంగా నాటు కోడి కూర లేదా పెరుగు, పచ్చడితో ఆస్వాదిస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ భోజనం ఇప్పుడు నగరాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది.