హైదరాబాద్: 28°C
తెలంగాణ

రౌడీషీటర్లకు CI కౌన్సిలింగ్

HNK: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు CI శివకుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రాబోయే పండుగలు, జాతరలు, ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వారిని స్టేషన్‌కు పిలిపించారు. భూ వివాదాలు, గొడవలు, చిన్నతగాదాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.