హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా మైదానం లేక ఇబ్బందులు

MNCL: జన్నారంలో సరైన క్రీడా మైదానం లేక యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి పోలీస్, ఆర్మీ తదితర ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత అధికంగా ఉంది. ఫిట్‌నెస్ కోసం శిక్షణ పొందేందుకు అనువైన మైదానం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఉద్యోగాల ఎంపికలో వెనుకబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.