హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

PDPL: రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సెంటనరీ కాలనీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటించారు. మార్కెట్ చౌరస్తాలోని శ్రీరామాంజనేయ మేకల మండీ వద్ద మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పదో వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి టెంకాయ కొట్టారు. అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు.