హైదరాబాద్: 28°C
తెలంగాణ

​నక్షా బాట ధ్వంసం.. రైతుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరఖుర్దులో పొలాలకు వెళ్లే పురాతన నక్షా బాట (సర్వే నం. 289) ధ్వంసమైంది. కొందరు భూ యజమానులు, రెవెన్యూ అధికారులు కలిసి ఈ బాటను తొలగించారని రైతులు ఆరోపిస్తున్నారు. దారి లేక ట్రాక్టర్లు, పశువుల రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి వెంటనే బాటను పునరుద్ధరించాలని బాధిత రైతులు కోరారు.