GDWL: అలంపూర్ పట్టణంలోని జోగులాంబ ఆలయాలను దర్శించడానికి నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ పట్టణానికి రానున్నట్టు బీజేపీ పట్టణ కార్యదర్శి నరేష్ తెలిపారు. అదేవిధంగా పట్టణంలో నెలకొన్న పలు సమస్యలపై పట్టణ ప్రజల తరఫున వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా అలంపూర్‌లో డిగ్రీ కాలేజ్‌తో పాటు ఇతర సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్దాం: BJP


