హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

KMR: కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీ ఫ్రీజర్‌లో భద్రపరిచారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.