WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఇళ్ల మధ్య నుంచి నూతనంగా ఏర్పాటు చేస్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ పనులను నిలిపివేయాలని గ్రామస్థులు కోరారు. ఈ మేరకు వర్ధన్నపేట ఏఈ తరుణ్‌కు వార్డు సభ్యులు, గ్రామస్థులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. విద్యుత్ లైన్‌తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజల భద్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గంలో లైన్ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
ఇళ్ల మధ్య 11 కేవీ లైన్ వద్దంటున్న గ్రామస్థులు


