హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేదరిబస్తీలో ప్రమాదకరంగా మ్యాన్‌హోల్‌

PDPL: గోదావరిఖని మేదరిబస్తీ ప్రధాన కూడలిలో రోడ్డు కుంగిపోవడంతో మ్యాన్‌హోల్‌ మూత పగిలి ప్రమాదకరంగా మారింది. రద్దీ ప్రాంతంలో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ అపరిశుభ్రతకు కారణమవుతోంది. మరమ్మతులు చేపట్టకుండా ట్రాఫిక్ కోన్లు మాత్రమే ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.