హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్చర్లలో ప్రయాణికుల రద్దీ.. బస్సుల కోసం అవస్థలు

MBNR: రాఖీ పండుగ ముగింపు, ఆదివారం సెలవుతో జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ వైపు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూశారు. అరకొర బస్సులతో తోపులాటకు గురై మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతున్నారు.