హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆఫీస్‌లో నిద్రపోతున్నారా..?

ఆఫీస్‌లో నిద్ర వస్తోందా? ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్యే. తగినంత నిద్ర లేకపోవడం, బద్ధకం ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల పనిలో ఏకాగ్రత దెబ్బతింటుంది.అందుకే ప్రతి రెండు గంటలకూ ఒకసారి లేచి చిన్నగా నడవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి, ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. ముఖం చల్లటి నీటితో కడుక్కోవాలి. గాలి బాగా ఆడే ప్రదేశంలో కొంతసేపు ఉండాలి.