హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయానికి పాదయాత్ర

SRD: విశ్వశాంతి కోసం వీరశైవ లింగాయత్ సమాజం ప్రతిఏటా పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు ఉమామహేశ్వర ఆలయం నుంచి బొంతపల్లి వరకు సాగిన 19వ మహా పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.