హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు

W.G: జిల్లాలో మహిళలు, బాలల సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం పలు ఖాళీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో కలెక్టర్ నాగరాణి పాల్గొని అభ్యర్థుల ప్రతిభను పరిశీలించారు. ఖాళీగా ఉన్న మొత్తం 7 పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.