హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజన ప్రాంతాల్లో డిజిటల్‌ విప్లవం'

ASR: గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ విప్లవంతో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని CM చంద్రబాబు అన్నారు. అరకులోయ మండలం గన్నేలలో 'సంజీవని' కార్యక్రమంలో గిరిజన వృద్ధురాలు తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేయడం చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ విప్లవం ఇప్పుడు పట్టణాలకే పరిమితం కాకుండా మారుమూల గిరిజన గ్రామాలకూ చేరిందని ట్వీట్ చేశారు.