SKLM: టెక్కలిలో రాజారాణీ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు రైల్వే అధికారులకు శనివారం వినతిపత్రం అందించారు. టెక్కలి స్టేషన్లో సౌత్ కోస్ట్ రైల్వే అధికారులను కలసి సమస్యను విన్నవించారు. విద్య, వైద్య, వ్యాపార అవసరాల నిమిత్తం రైళ్లు నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కలి మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హాల్ట్ కల్పించాలని వినతి


