హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్పపీడనం.. జిల్లాలో వర్షాలు

ASR: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రేపు జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, అలాగే, మరి కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి 40 - 50 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.