హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏకలవ్యలో సీటు ఇప్పించాలని పీవోకు వినతి

ADB: నార్నూర్ మండలంలోని గుంజాల గ్రామానికి చెందిన కుమ్ర విజయ్ తండ్రి దొంగురావు ఇటీవల మరణించాడు. అనాథలుగా మారిన కుమ్ర విజయ్‌తో సహా ఇద్దరు చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని, చదువు కోసం ఏకలవ్య పాఠశాలలో సీటు ఇవ్వాలని శనివారం విజయ్ పీవో మంద మకరందుకు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన పీవో.. త్వరలో సీటు మంజూరు చేయిస్తామన్నారు.