హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీలో సాంకేతిక లోపం.. స్తంభించిన ట్రాఫిక్

ATP: గుత్తిలోని గాంధీ చౌక్ వద్ద శనివారం కంటైనర్ లారీ ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో రోడ్డుమధ్యలో నిలిచిపోయింది. దీంతో గుత్తి-గుంతకల్లు, గుత్తి-తాడిపత్రి మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.