KDP: తమకు కేటాయించిన భూములను పరిరక్షించాలని కోరుతూ మాధవరం-1స్క్రీ నగరకు చెందిన దళిత రైతులు నిరవధిక దీక్షకు అనుమతి కోరుతూ సిద్ధవటం MRO, ఒంటిమిట్ట CIకు వినతిపత్రం అందజేశారు. తమ భూముల్లో మట్టి తరలింపును అడ్డుకుంటున్నారని, బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఉన్నందున అహింసా పద్ధతిలో నిరసన చేపట్టేందుకు స్థలం కేటాయించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
భూముల కోసం దళిత రైతుల నిరవధిక దీక్ష


