హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్‌

KMR: బీర్కూర్‌ మండలం మల్లాపూర్‌ శివారులో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో ప్రమాదకరంగా మారింది. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పెరిగిన మొక్కలను తొలగించి సమస్యను పరిష్కరించాలని రైతులు విద్యుత్‌ అధికారులను కోరుతున్నారు.