హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఏలేశ్వరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

KKD: 132 కేవీ ప్రత్తిపాడు విద్యుత్ ఉప కేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా రేపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏలేశ్వరం పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఏలేశ్వరం మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాల్లో గృహ, వ్యవసాయ, ఆక్వా, స్టోన్ క్రషర్ విద్యుత్ సర్వీసులకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఈఈ బి.వీరభద్రరావు కోరారు.