హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సముద్రం నుంచి గోదావరి.. పులస ప్రయాణం..!

సముద్రంలో పుట్టి.. గోదావరి నీటిలోకి చేరే పులస చేప ప్రయాణం ప్రత్యేకమైంది. సముద్రంలో జీవించే ఇలసి చేప సంతానోత్పత్తి కోసం గోదావరి ప్రవాహాన్ని అనుసరిస్తూ నదిలోకి వస్తుంది. గోదావరి నీటిలోకి ప్రవేశించిన తర్వాత దాని రుచి, నాణ్యత మరింత పెరుగుతుందని చెబుతారు. అందుకే పులసకు గోదావరి జిల్లాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. సీజన్‌లో లభ్యత తక్కువగా ఉండటంతో ధర కూడా భారీగా పలుకుతుంది.