NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయాన్ని శనివారం డ్యామ్ సేఫ్టీ కమిటీ బృందం సందర్శించారు. విశ్రాంత ఇంజనీర్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు డ్యామ్‌కు సంబంధించిన రికార్డులు, మ్యాపులను పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి క్రస్టు గేట్లను తనిఖీ చేశారు. జలాశయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సోమశిల జలాశయాన్ని సందర్శించిన డ్యామ్ సేఫ్టీ కమిటీ


