హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల పరిశీలన

సత్యసాయి: పరిగి మండలంలో పూర్తి చేసిన 21 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న మరో 8 కాంప్లెక్స్‌ల పనులను తనిఖీ చేసి, స్థానిక కాలనీవాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.