హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓబీసీ కమిటీల పునర్నిర్మాణంపై కాంగ్రెస్‌ సమావేశం

NRPT: నారాయణపేట సీవీఆర్‌ భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు కె. ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన శనివారం ఓబీసీ కమిటీల పునర్నిర్మాణం, పార్టీ బలోపేతంపై సమావేశం నిర్వహించారు. టీపీసీసీ పరిశీలకుడు కోట్ల చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, ఓబీసీ వర్గాలను కాంగ్రెస్‌తో అనుసంధానం చేయాలని ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.