హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయ అభివృద్ధికి విరాళం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు భక్తులు విరాళాలు అందిస్తున్నారు. కొత్తపల్లి (హవేలీ) గ్రామానికి చెందిన దూస రిషికేష్ రూ.25 వేల నగదును విరాళంగా అందజేశారు. స్థానిక ప్రోటోకాల్ కార్యాలయంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మకు నగదు అందించి రసీదు పొందారు. ఆలయ పీఆర్వో పెరిక శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు.