హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల అభ్యంతరాలు స్వీకరించిన కలెక్టర్

ASF: దహెగాం మండలం అమర్‌గొండ గ్రామంలో శరవేగంగా కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను కలెక్టర్ కే.హరిత శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ భూముల గ్రౌండ్ ట్రూతింగ్, గ్రామ పొలిమేరలు, ఆవాస ప్రాంతాలు, ప్రభుత్వ భూముల సరిహద్దులను తనిఖీ చేశారు. అనంతరం GNSS రోవర్ పరికరాల పనితీరును పరిశీలించి, రైతుల అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించారు.