హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్ పరీక్ష.. రేపు హైదరాబాద్‌లో ఆంక్షలు

HYD: రేపు హైదరాబాద్‌లో NEET-PG 2026 పరీక్షల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు గుమిగూడటం నిషేధం. 100 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇవి అమలులో ఉంటాయి. విధుల్లోని పోలీసులు, విద్యాశాఖ స్క్వాడ్, అంతిమ యాత్రలకు మినహాయింపు ఉంటుంది.