హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'గన్నవరంలో 3 నెలల్లో బ్లాక్‌చైన్ అమలు'

కృష్ణా: గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సురక్షిత బ్లాక్‌చైన్ పైలట్ ప్రాజెక్టు పరిశీలించామని ఏపీ భూపరిపాలన కమిషనర్ జయలక్ష్మి తెలిపారు. భూములు సురక్షితంగా ఉండాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. యజమానికి తెలియకుండా ఇతరుల చేతుల్లోకి భూమి వెళ్లకూడదని, నమ్మకం కల్పించేందుకే ఈ ఏర్పాటు చేశామన్నారు. 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తామన్నారు.