హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలకు ఆహ్వానం

అన్నమయ్య: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో ఆహ్వాన కమిటీ సభ్యులు మండలంలోని ఎన్డీఏ నాయకులను వేడుకలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.