హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత'

కృష్ణా: గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని గన్నవరం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్రాంత అధ్యాపకులు గన్నే వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు పిల్లలకు తెలుగు, కూచిపూడి నేర్పుతూ సంస్కృతిని కాపాడుతున్నారని, మన నేలపై ఆంగ్ల వ్యామోహం పెరగడం విచారకరమన్నారు.