SRCL: చందుర్తి మండల కేంద్రంలో శ్రావణమాసం సందర్భంగా శనివారం నిర్వహించిన శ్రీ కొత్త హనుమాన్ స్వామివారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలంతా స్వామివారి కృపతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
తెలంగాణ
హనుమాన్ జాతర పాల్గొన్న ప్రభుత్వ విప్


