హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐఏఎస్ పరీక్షను తెలుగులోనే రాశాను: కలెక్టర్

సత్యసాయి: జిల్లా కలెక్టరేట్‌లో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాతృభాషా పరిరక్షణ, క్రీడల ప్రోత్సాహంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. తాను ఐఏఎస్ పరీక్షను తెలుగులోనే రాసి విజయం సాధించినట్లు గుర్తుచేసుకున్నారు. విద్యార్థుల్లో భాష, క్రీడల పట్ల మక్కువ పెంపొందించాలని సూచించారు.