హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న వరి విత్తనాల నమోదుకు చర్యలు

KNR: గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో సన్న రకాల వరి సాగుపై అధికారులు చర్యలు చేపట్టారు. ఏఈవో వెంకట్ ఆధ్వర్యంలో రైతుల నుంచి స్వయంగా నిల్వ చేసుకున్న, పరిశోధనా కేంద్రాల నుంచి పొందిన విత్తనాలకు సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు తీసుకున్నారు. అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేసిన విత్తనాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు.