హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూసార పరిరక్షణకు సేంద్రియ ఎరువులు: ఎమ్మెల్యే

NTR: నందిగామ మార్కెట్ యార్డులో రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూసారం పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం సాధ్యమని ఆమె అన్నారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూమి సారవంతంగా మారి, పంటల నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు.