హైదరాబాద్: 28°C
తెలంగాణ

KUలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

HNK: కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. కేయూ పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ చిర్ర రాజుగౌడ్‌, హెచ్‌ఓడీ డాక్టర్‌ లింగయ్య గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యావహారిక భాషా ఉద్యమంతో తెలుగు భాషను ప్రజలకు చేరువ చేసిన గిడుగు సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.