హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌటాల మండల MEO గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్

ASF: కౌటాల మండల నూతన MEOగా పర్స చంద్రశేఖర్ మండల వనరుల కేంద్రంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మండలంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యార్థులకు సక్రమంగా అందేలా, విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చూస్తానన్నారు.