హైదరాబాద్: 28°C
తెలంగాణ

పడిపోతానంటున్న విద్యుత్ స్తంభం..

NLG: పట్టణంలోని శివాజీ నగర్‌ రామగిరి సాయిబాబా మందిరం సమీపంలో విద్యుత్‌ స్తంభం ప్రమాదకరంగా ఒరిగిపోయింది. తాజాగా నాలా పనుల కోసం తవ్వకాలు చేపట్టడంతో స్తంభం కింద పట్టు కోల్పోయి ఎప్పుడు పడిపోతుందోనని స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్‌, మున్సిపల్‌ అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.