హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి'

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్ష 1978వ రోజుకు చేరింది. ఐద్వా విశాఖ జిల్లా కమిటీ దీక్షకు సంఘీభావం తెలిపింది. ప్లాంట్‌ను బలోపేతం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తున్నాయని ఐద్వా అధ్యక్షురాలు మాధవి ఆరోపించారు.