హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి: MPDO

NZB: భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామంలో శనివారం ఓటర్ల జాబితా సవరణలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. వివరాలు సక్రమంగా నమోదు కాని ఓటర్లకు నోటీసులు జారీ చేయడంతో, వారి నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. అనంతరం ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో బూత్ స్థాయి అధికారులు వివరాలు నమోదు చేసే ప్రక్రియను ఎంపీడీవో జి. సంతోష్‌కుమార్ పరిశీలించారు.