హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధిని అడ్డుకునేందుకే కిడ్నాప్ డ్రామా'

KDP: బాధితులను అధికారుల సమక్షంలో పిలిచి సమస్యలు తెలుసుకుంటే కిడ్నాప్ అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడం తగదని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పుత్త ఎల్లారెడ్డి అన్నారు. కమలాపురం ఆర్ఓబీ పనులు వేగంగా జరుగుతుండటాన్ని ఓర్చుకోలేకే వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై తాము అడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.