హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన

SKLM: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 44వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ ఏ. రాంగోపాల్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేత్ర వైద్యాధికారి రోణంకి వెంకటరమణ నేత్రదానం ప్రాధాన్యతను వివరించారు. ఒకరి నేత్రదానం ఇద్దరికి చూపునిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.