హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిల్పారామం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్ల పరిశీలన

ATP: CM చంద్రబాబు నాయుడు రేపు అనంతపురం పర్యటన నేపథ్యంలో శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత, వాహనాల పార్కింగ్, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.