హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు

KMR: బాన్సువాడ పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. చౌరస్తా వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహాన్ని కొంత వెనుకకు తరలించి వాహనాల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.