హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

NRML: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి బీ.శ్రీకాంత్‌రెడ్డి హాజరై ధ్యాన్‌చంద్ సేవలను స్మరించుకుంటూ, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.