హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్లో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

JN: జిల్లా కలెక్టరేట్లో మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా శనివారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై ధ్యానంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తేనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్య మవుతుందని, విద్యార్థులు ఆటలపై కూడా దృష్టి పెట్టాలని కలెక్టర్ అన్నారు.