హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సన్నాయి కళాకారులను ఆదుకోవాలి'

ASF: సన్నాయి వాయిద్యాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ సన్నాయి మేళం కమిటీ సభ్యుడు దత్తాత్రేయ కోరారు. దహెగాం మండలం చిన్న రాస్పల్లి గ్రామంలో తమ కుటుంబాలు 70-80 ఏళ్లుగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న తమకు దేవాదాయ శాఖ దేవస్థానాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.