ADB: ఇచ్చోడ మండలంలోని చిన్న గోధుమల్లె, ఎల్లమ్మగూడ గ్రామస్తులు మాజీ ఎంపీ సోయం బాపూరావును శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోడ్డు సౌకర్యం, డ్రైనేజీ, సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మాజీ ఎంపీతో విన్నవించారు. గ్రామంలోని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని సోయం హామీ ఇచ్చారు.
తెలంగాణ
గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి: సోయం


